బుధవారం 27 జనవరి 2021
Business - Jan 13, 2021 , 14:38:56

అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్ ధ‌ర ఎంతో తెలుసా?

అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్ ధ‌ర ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: ఓవ‌ర్ ద టాప్ ప్లాట్‌ఫామ్స్ మ‌ధ్య పోటీ తీవ్ర‌మ‌వుతోంది. ముఖ్యంగా టాప్ ప్లేస్‌లో ఉన్న‌ నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో మ‌ధ్య ఈ పోటీ మ‌రింత ఎక్కువగా ఉంది. ప్రైమ్‌తో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ కాస్త ముందుంది. పైగా మొబైల్‌కు మాత్ర‌మే ప‌నికొచ్చే రూ.199 ప్లాన్ నెట్‌ఫ్లిక్స్‌కు అనుకూలంగా మారింది. అయితే ఇప్పుడు ప్రైమ్ వీడియో కూడా అదే రూట్‌లో వెళ్తోంది. ప్ర‌పంచంలోనే తొలిసారి ఇండియాలో ఈ మొబైల్ ఓన్లీ ప్లాన్‌ను లాంచ్ చేసింది.

ఎయిర్‌టెల్‌తో క‌లిసి..

ఈ కొత్త ప్లాన్‌ను భార‌తీ ఎయిర్‌టెల్‌తో క‌లిసి అమెజాన్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా తొలి 30 రోజులు ఉచితంగా ట్ర‌య‌ల్ చేయ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత 28 రోజుల‌కు రూ.89 వ‌సూలు చేస్తారు. ప్రైమ్ వీడియోను మొబైల్‌లో చూసుకునే అవ‌కాశంతోపాటు ఇదే ప్లాన్‌లో 6 జీబీ డేటా కూడా వ‌స్తుంది. ఇదే ప్రైమ్ వీడియో సాంప్ర‌దాయ ప్లాన్ నెల‌కు రూ.129, సంవ‌త్స‌రానికి రూ.999గా ఉన్న విష‌యం తెలిసిందే. 

ఒక్క యూజ‌ర్‌కే..

ఈ మొబైల్ ఓన్లీ ప్లాన్‌పై కేవ‌లం ఒక్క యూజ‌ర్ మాత్ర‌మే ప్రైమ్ వీడియోను యాక్సెస్ చేయ‌వ‌చ్చు. ఎస్‌డీ (స్టాండ‌ర్డ్ డెఫినిష‌న్‌) క్వాలిటీ స్ట్రీమింగ్ వ‌స్తుంది. ఇక ఇందులోనే రూ.299 ప్లాన్ కూడా ఉంది. ఇందులో భాగంగా ప్రైమ్ వీడియోతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌.. రోజుకు 1.5 జీబీ డేటా వ‌స్తుంది. అమెజాన్‌కు ఇండియా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ స‌రికొత్త ప్లాన్‌తో దేశంలో మ‌రింత విస్త‌రించాల‌ని ఆ సంస్థ చూస్తోంది. ఇండియాలో మొత్తం ఆన్‌లైన్ వీడియో ఆదాయంలో నెట్‌ఫ్లిక్స్ వాటా 14 శాతం కాగా.. అమెజాన్ వాటా 7 శాతంగా ఉంది. 


ఇవి కూడా చ‌ద‌వండి

ప్లీజ్‌.. మా పాప ఫొటోలు తీయొద్దు!

ఇండియాకు టెస్లా.. కారు ధ‌ర ఎంతో తెలుసా?

డేంజ‌ర్‌లో టీమిండియా.. హోట‌ల్ ప‌క్క‌నే కొత్త క‌రోనా కేసులు!

బ్రిస్బేన్‌లో తిరుగులేని ఆస్ట్రేలియా.. గ‌బ్బా కోట బ‌ద్ధ‌ల‌య్యేనా?


logo