మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Business - Aug 04, 2020 , 16:52:57

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌..అదిరిపోయే ఆఫర్లు

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌..అదిరిపోయే ఆఫర్లు

ముంబై:  భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్‌, ఇతర గృహోపకరణాలను కొనాలనుకునేవారికి  సువర్ణావకాశం. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా     'అమెజాన్‌ ప్రైమ్‌ డే-2020 సేల్'‌తో  సందడి చేయనుంది.   ఈ ఏడాది వార్షిక సేల్‌ను ఆగస్టు 6 నుంచి 7 వరకు రెండురోజుల పాటు నిర్వహించనుంది. ప్రైమ్‌ డే  సేల్‌లో భాగంగా గ్రేట్‌ డీల్స్‌తో పాటు కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేయబోతోంది.  హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేసే  వినియోగదారులకు 10 శాతం తక్షణ రాయితీ లభించనుంది. 

రెండు రోజుల  సేల్‌ ప్రత్యేకంగా అమెజాన్‌  ప్రైమ్‌ సభ్యుల కోసం మాత్రమే   నిర్వహిస్తున్నది. ప్రైమ్ సభ్యులుగా మారడానికి ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి ప్రతి ఏడాది అమెజాన్  స్పెషల్‌ సేల్‌ నిర్వహిస్తోంది. మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు, గేమింగ్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వినోదం, దుస్తులు తదితర వస్తువులపై  ఎంఆర్పీ కంటే తక్కువ ధరకే విక్రయించనుంది. సేల్‌లో భాగంగా మరెన్నో ప్లాష్‌సేల్స్‌తో పాటు కొత్త ప్రొడక్ట్‌లను లాంచ్‌ చేయనుంది. 

ఎకోప్లస్‌పై ప్లాట్‌ 50శాతం,  ఎకో స్మార్ట్‌ డిస్‌ప్లేలపై 8000వేల వరకు  తగ్గింపు,  ఎకో డాట్‌+ స్మార్ట్‌ కలర్‌ బల్బు బండిల్‌పై ఫ్లాట్‌ 60శాతం ఆఫ్‌, ఫైర్‌ టీవీ స్టిక్‌, ఫైర్‌ టీవీ స్టిక్‌ 4కే తదితర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై 40శాతం వరకు  తగ్గింపు వర్తించనుంది.  ప్రముఖ కంపెనీలు, బ్రాండ్లకు చెందిన 300కు పైగా ఉత్పత్తులు ఆగస్టు 6, 7 తేదీల్లో విడుదల కానున్నాయి. వీటిపై 20శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు కూడా లభిస్తాయని కంపెనీ పేర్కొంది.   ఇలా ప్రతీ విభాగంలోనూ బంపర్‌ ఆఫర్లు, అదిరిపోయే డిస్కౌంట్లతో ప్రైమ్‌ డే సేల్‌ను నిర్వహించేందుకు అమెజాన్‌ రెడీ అయింది.


logo