శనివారం 26 సెప్టెంబర్ 2020
Business - Aug 06, 2020 , 00:11:05

స్పెషల్‌ సేల్స్‌ షురూ

స్పెషల్‌ సేల్స్‌ షురూ

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి స్పెషల్‌ సేల్స్‌తో తమ వినియోగదారులను ఆకట్టుకొనేందుకు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా ప్రైమ్‌ డే-2020 సేల్‌ను అమెజాన్‌, బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభించనున్నాయి. ఈ సేల్స్‌లో పలు రకాల మొబైల్‌ ఫోన్లు, లాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల కొనుగోలుదారులకు భారీ రాయితీలు ఇవ్వనున్నట్టు ఈ రెండు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన తర్వాత అమెజాన్‌ నిర్వహిస్తున్న తొలి ప్రత్యేక సేల్‌ ఇదే. కేవలం ప్రైమ్‌ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ సేల్‌ను ఈ 7వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగించనున్నట్టు అమెజాన్‌ వెల్లడించింది. కాగా, బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌ సేల్‌ను ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి వరకు నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ స్పష్టం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యులకు ఈ సేల్‌ బుధవారం రాత్రి 8 గంటల నుంచే అందుబాటులోకి వచ్చింది. logo