శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 30, 2020 , 06:34:25

కొనుగోలుదారులకు శుభవార్త అందించిన అమెజాన్

కొనుగోలుదారులకు శుభవార్త అందించిన అమెజాన్

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌.. కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది.  నచ్చి న వస్తువులను ముందుగా కొనుగోలు చేసి, ఆ తర్వాత ఏడాది పాటు చెల్లింపులు జరిపే అవకాశాన్ని కల్పించింది. వీటిపై ఎలాంటి వడ్డీని వసూలు చేయబోమని ప్రకటించింది. అయితే, వస్తువును కొనుగోలు చేసినప్పుడే వినియోగదారుడు ఎలా చెల్లింపులు జరుపనున్నది ముందే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రూ.60 వేల లోపు గాడ్జెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని సంస్థ కల్పించింది.

అమెజాన్‌ ఇండియా మొబైల్‌ యాప్‌ ద్వారా అమెజాన్‌ పే లేటర్‌ సర్వీస్‌ను రిజిస్టేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సేవలు డెస్క్‌టాప్‌ యూజర్లకు అందుబాటులో లేదు. అమెజాన్‌ పేని రిజిస్టేషన్‌ చేసుకునే వినియోగదారులు కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం మీరు అర్హులయ్యారో కాదో అని డాష్‌బోర్డుపై నో యువర్‌ స్టేటస్‌ వద్ద చెక్‌ చేసుకోవచ్చు. మనం ఎంతవరకు నగదు కొనుగోలుకు అర్హత సాధించమన్న విషయం డాష్‌బోర్డుపై చూపిస్తుంది. 


logo