న్యూఢిల్లీ: ఆంక్షలు, నిషేధాల మధ్య ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న క్రిప్టో కరెన్సీలకు గుడ్ న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. తమ ఉత్పత్తుల క్రయ విక్రయాలను బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలను అనుమతించనున్నట్లు సంకేతాలిచ్చింది.
పేమెంట్స్ టీం అధిపతిగా డిజిటల్ కరెన్సీ అండ్ బ్లాక్ చైన్ ప్రొడక్ట్‌కు సారధ్యం వహించిన ప్రొఫెషనల్‌ను అమెజాన్ నియమించుకోవడమే దీనికి నిదర్శనం. అమెజాన్ డిజిటల్ కరెన్సీ అండ్ బ్లాక్ చైన్ స్ట్రాటర్జీని డెవలప్ చేయడంతోపాటు ప్రొడక్ట్ రోడ్ మ్యాప్ ఖరారు చేయడానికి అనుభవజ్ఞుడైన నిపుణుడి నియామకం కోసం ఆసక్తిగా చూస్తున్నది అమెజాన్ పేమెంట్స్ యాక్సెప్టెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ టీం.
వివిధ దేశాల ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షలు.. క్రిప్టో కరెన్సీ తయారీ, ట్రేడింగ్‌పై నిషేధం విధిస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో గతేడాది నుంచి ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లిన బిట్ కాయిన్.. ఇతర క్రిప్టో కరెన్సీలు.. ఆంక్షలతో పతనం అవుతున్నాయి. గత ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 65 వేల డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్… ఇప్పుడు సగానికి పైగా పతనమైంది.
గత మే నెలారంభం నుంచి పతనం మొదలైన బిట్ కాయిన్ ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నది. మే 12 తర్వాత బిట్ కాయిన్ శనివారం 50 రోజుల నాటి స్థాయికి ఎదిగింది. ఆదివారం వరుసగా ఐదో రోజు రికార్డు స్థాయిలో బిట్ కాయిన్ విలువ 34,609 డాలర్లకు చేరుకున్నది.
Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ మూడో రౌండ్లో మనికా బాత్రా
ఇండియా రెజ్లర్ ప్రియా మాలిక్‌కు గోల్డ్ మెడల్
Tokyo Olympics: మహిళల టెన్నిస్ డబుల్స్‌లో సానియా జోడీ ఓటమి
Tokyo Olympics: ఆ ముగ్గురు తప్ప.. రెండో రోజు ఇండియాకు నిరాశే
Mirabai Chanu: మీరాబాయి చాను టాప్ 10 ఇంస్టాగ్రామ్ పోస్టులు
భారత్‌లో టెస్లా యూనిట్.. ఎలన్ మస్క్ ఏమన్నారంటే?
చైనా.. అమెరికాను భారత్ దాటుతుందా.. ముకేశ్ అంబానీ ఏం చెప్పారు?
ITR FY2021-22.. ఇలా ఐటీఆర్ ఫైలింగ్ ఈజీ.. 5 హెడ్స్ కింద ఇన్‌కం వర్గీకరణ
Home loan Vs Plot loan| ఇంటిపై లోన్ తీసుకోవడం బెటరా.. ఇంటి స్థలంపైనా ? ఏది బెస్ట్ ?