గురువారం 28 మే 2020
Business - May 21, 2020 , 23:47:04

ఫుడ్‌ డెలివరీలోకి అమెజాన్‌

ఫుడ్‌ డెలివరీలోకి అమెజాన్‌

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా ఫుడ్‌ డెలివరీల మార్కెట్లోకి ప్రవేశించింది. బెంగళూరులోని ఎంపికచేసిన కొన్ని ప్రాంతాల్లో ఫుడ్‌ డెలివరీలను ప్రారంభిస్తున్నట్టు ఆ సంస్థ గురువారం వెల్లడించింది. దీంతో అమెజాన్‌ దేశంలో ఇప్పటికే ఫుడ్‌ డెలివరీలు నిర్వహిస్తున్న జొమా టో, స్విగ్గీ లాంటి ప్రముఖ సంస్థలతో పోటీపడనున్నది. కొవిడ్‌-19 సంక్షోభం కారణంగా 1,600 మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జొమాటో, స్విగ్గీ ప్రకటించిన తరుణంలో ఫుడ్‌ డెలివరీల రంగంలోకి అడుగుపెడుతున్నట్టు అమెజాన్‌ ప్రకటించింది.


logo