Amazon Great Indian Festival | ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్నది. అక్టోబర్ నాలుగో తేదీ నుంచి నెల రోజులు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ సాగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఇక అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఒక రోజు ముందుగానే డీల్స్‌ను అందుకునే అవకాశం ఉంటుంది.
కస్టమర్లను ఆకర్షించడానికి అమెజాన్ వివిధ మొబైల్ ఫోన్ మోడల్స్, యాక్సెసరీలు, స్మార్ట్ వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలపై తాము అందించే డిస్కౌంట్లను సూచించే మైక్రోసైట్ రూపొందించింది.
అమెజాన్ ఎకో, ఫైర్ స్టిక్, కిండ్లే డివైజ్‌లనూ తక్కువ ధరకే అందించనుంది. ఆపిల్, ఆసుస్, ఫాజిల్, హెచ్‌పీ, లెనోవో, వన్‌ప్లస్, శ్యామ్‌సంగ్, సోనీ, షావోమి సంస్థలకు చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తారు. వచ్చేనెల 7 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తామని ఫ్లిప్‌కార్ట్ ఇంతకుముందే ప్రకటించింది.