బుధవారం 03 జూన్ 2020
Business - May 21, 2020 , 17:48:47

స్విగ్గి, జొమాటోలకు పోటీగా అమెజాన్‌

స్విగ్గి, జొమాటోలకు పోటీగా అమెజాన్‌

బెంగళూరు: ఆన్‌లైన్‌లో కొరుకొన్న ఆహార పదార్థాలను చేరవేయడంలో ఇప్పటికే స్విగ్గి, జొమాటోలు పోటీపడి మరీ సేవలందిస్తున్నాయి. ఈ రెండు ఈ కామర్స్ వేదికలకు పోటీగా అతిపెద్ద ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ రంగంలో దిగింది. తొలుత బెంగళూరులోని ఎంపికచేసిన కొన్ని ప్రాంతాల్లో ఆహార పదార్థాలను చేరవేసే కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు అమోజాన్‌ సంస్థ గురువారం వెల్లడించింది. తొలుత బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో టెస్టింగ్ ప్రాతిపదికన సరఫరా చేయాలని నిర్ణయించినట్లు అమెజాన్‌ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. బెంగళూరులోని మహదేవపుర, మారథల్లి, వైట్‌ఫీల్డ్స్‌, బెళ్లందూర్‌ ప్రాంతాల్లోని 100 కు పైగా రెస్టారెంట్ల నుంచి తొలుత అమెజాన్‌ ఫుడ్‌ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

తొలుత ఈ సేవలను ఆరు నెలలపాటు నిర్వహించి పరీక్షిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్విగ్గి, జొమాటో, ఉబెర్‌ ఈట్స్‌ సంస్థలు సరఫరా సేవలు నిలిచిపోయి ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నాయి. కొన్నిప్రాంతాల్లో ఉద్యోగులను సైతం తొలగించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఫుడ్‌ సప్లైయింగ్‌లోకి అమెజాన్‌ రాకతో స్విగ్గి, జొమాటోలకు పెద్ద సవాలు ఎదురుకానున్నదని చెప్పవచ్చు. బెంగళూరులో సేవలు సంతృప్తికరంగా కొనసాగించిన తర్వాత ముంబై, ఢిల్లీల్లో సేవలను ప్రారంభించేందుకు అమెజాన్‌ కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.


logo