శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Jun 29, 2020 , 23:11:43

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఇక వినియోగించం: అమెజాన్

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఇక వినియోగించం: అమెజాన్

ముంబై: ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్‌ రంగ సంస్థ అమెజాన్‌ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను ఇక వినియోగించబోమని సోమవారం ప్రకటించింది. తమ 50 ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్ల నుంచి దీని వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొన్న‌ది. అమెజాన్‌ ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని 2019లోనే ప్రకటించింది. ఇప్పుడు దానిని వేగవంతం చేసినట్లు తెలిపింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఇక‌పై వినియోగించ‌కూడ‌ద‌ని అమెజాన్‌ డిసెంబర్‌లోనే కీలక చర్యలు చేప‌ట్టింది. 

అప్పటి నుంచే బబుల్‌ పేపర్‌ మెటీరియల్‌ను పేపర్‌ కుషన్‌తో భర్తీ చేయడం మొదలుపెట్టింది. అంతేగాక‌ ఈ ఏడాది ఆరంభలో బయోడీగ్రేడబుల్‌ పేపర్‌టేప్‌ను ప్రారంభించింది. ఇది ప్యాకేజీకి భద్రత ఇవ్వడంతో పాటు పర్యవరణానికి హాని చేయదు. కస్టమర్లు కోరే ఇతర రకాల ప్యాకేజీలకు కూడా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వినియోగించకూడ‌ద‌ని అమెజాన్ నిర్ణ‌యం తీసుకుది. త‌మ‌కున్న సౌకర్యాల్లో 100 శాతం రీసైక్లింగ్‌ చేయగలిగే మెటిరీయల్‌నే వాడుతున్నామని పేర్కొన్న‌ది. 


logo