శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 19, 2020 , 02:12:19

యాపిల్‌ ఉత్పత్తులపై రాయితీలు

యాపిల్‌ ఉత్పత్తులపై రాయితీలు

  • అమెజాన్‌లో ప్రత్యేక సేల్‌ షురూ

న్యూఢిల్లీ, జూలై 18: ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌.. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రత్యేక సేల్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ‘యాపిల్‌ డేస్‌' పేరుతో ఈ నెల 25 వరకు జరిగే ఈ సేల్‌లో ఐఫోన్‌ 11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లతోపాటు యాపిల్‌ వాచ్‌, మ్యాక్‌బుక్‌ లాంటి యాపిల్‌ ఉత్పత్తులను తగ్గింపు ధరలతో కొనుగోలుదారులకు అందించనున్నది. యాపిల్‌ గాడ్జెట్‌ ప్రేమికులు ఈ సేల్‌లో ఐఫోన్‌-11ను రూ.62,900కే పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి ఐఫోన్‌-11ను కొనుగోలు చేసేవారికి అదనంగా రూ.4 వేల డిస్కౌంట్‌ లభిస్తున్నది.


logo