సోమవారం 01 మార్చి 2021
Business - Dec 30, 2020 , 01:26:44

అమెజాన్ మెగా సేల్‌

అమెజాన్ మెగా సేల్‌

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌ ఇండియా నూతన సంవత్సర వేడుకలకు ముందే తమ కస్టమర్లకు తీపికబురు అందించింది. ‘మెగా శాలరీ డేస్‌ సేల్‌' పేరుతో జనవరి 1 నుంచి 3 వరకు ప్రత్యేక సేల్‌ను నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ సేల్‌లో చిన్న, పెద్ద గృహోపకరణాలతోపాటు టీవీలు, లాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు, ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. శాంసంగ్‌, ఎల్‌జీ, వర్ల్‌పూల్‌, ఐఎఫ్‌బీ, సోనీ, జేబీఎల్‌ లాంటి పెద్ద బ్రాండ్లకు చెందిన హై-వాల్యూ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారికి అధిక రాయితీలు అందజేయనున్నట్టు తెలిపింది. ఈ సేల్‌లో నోకాస్ట్‌ ఈఎంఐ లాంటి సులభమైన ఫైనాన్స్‌ ఆప్షన్లు, ఎక్సేంజ్‌ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డులతోపాటు క్రెడిట్‌ కార్డు ఈఎంఐలతో వస్తువులను కొనుగోలు చేసేవారికి 10 శాతం (రూ.1,250 వరకు), ఈఎంఐ లావాదేవీలపై రూ.1,500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుందని వివరించింది.

VIDEOS

logo