ఆదివారం 05 జూలై 2020
Business - Jun 30, 2020 , 19:59:31

ఉద్యోగుల‌కు బోన‌స్ ప్ర‌క‌టించిన అమెజాన్

ఉద్యోగుల‌కు బోన‌స్ ప్ర‌క‌టించిన అమెజాన్

ముంబై: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన ఉద్యోగులకు‌ శుభవార్త చెప్పింది. కరోనా వైరస్‌ సంక్షోభంలోనూ పనిచేస్తున్న‌ ఉద్యోగులకు ఏకకాల బోనస్‌లు అందజేస్తామని ప్రకటించింది. ఇందుకోసం 500 మిలియన్‌ డాలర్లు (రూ.3,775 కోట్లు) ఖర్చుచేస్తామని వెల్లడించింది. జూన్‌ వరకు పనిచేసిన ఉద్యోగులు, భాగస్వాములు ఒక్కొక్కరు సంస్థ‌లో త‌మ హోదాను బ‌ట్టి 150 డాలర్ల (రూ11,300) నుంచి 3000 డాలర్ల (రూ.2.26 లక్షలు) వ‌ర‌కు  ఏకకాల బోనస్‌గా అందుకుంటారని‌ తెలిపింది. 

ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ అయిన అమెజాన్ ఏటా 10 బిలియన్‌ వస్తువులను వినియోగదారుల‌కు చేర‌వేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రబలడంతో అమెజాన్‌ బిజెనెస్‌పై ప్ర‌భావం ప‌డింది. ఆర్డ‌ర్లు బాగా త‌గ్గిపోవ‌డంతో అనుకున్న మేర‌కు లాభాలు మూట‌గ‌ట్టుకోలేక పోయింది. అయినాస‌రే, కష్ట‌కాలంలో సంస్థ కోసం ప‌నిచేసిన త‌న ఉద్యోగుల‌కు బోన‌స్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది.         


logo