అమర రాజా 500 శాతం డివిడెండ్

- క్యూ3లో 20 శాతం పెరిగిన లాభం
హైదరాబాద్, ఫిబ్రవరి 13: ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం రూ.259.90 కోట్లు ఆర్జించింది. అంతక్రితం ఏడాది వచ్చిన రూ.217 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 20 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1,757.81 కోట్ల నుంచి రూ.1,960 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5 లేదా 500 శాతం మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది.
ఏపీలో 220 కోట్లతో సోలార్ ప్లాంట్
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో రూ.220 కోట్లతో 50 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అమర రాజా కంపెనీ సీఈవో విజయానంద్ తెలిపారు. ఈ యూనిట్‌తో కంపెనీ విద్యుత్ బిల్లులు తగ్గడంతోపాటు కాలుష్యం కూడా భారీగా తగ్గుతుందన్నారు. దీంతోపాటు లక్ష టన్నుల సామర్థ్యం కలిగిన రీసైక్లింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.
తాజావార్తలు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ
- తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
- టీఆర్ఎస్తోనే నిరంతర అభివృద్ధి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- గురువాయూర్‌లో ఏనుగులకు పరుగుపందెం