ఆదివారం 29 మార్చి 2020
Business - Mar 01, 2020 , 00:56:38

తగ్గిన అలహాబాద్‌ బ్యాంక్‌ రుణాల వడ్డీరేట్లు

తగ్గిన అలహాబాద్‌ బ్యాంక్‌ రుణాల వడ్డీరేట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ అలహాబాద్‌ బ్యాంక్‌ శనివారం రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. తమ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆధారిత వడ్డీరేట్లను 40 బేసిస్‌ పాయింట్ల వరకు దించుతూ బ్యాంక్‌ ఆస్తుల బాధ్యత-నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకున్నది. కొత్త వడ్డీరేట్లు ఆదివారం నుంచే అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో బ్యాంక్‌ తెలియజేసింది. దీంతో కస్టమర్లకు, ముఖ్యంగా రిటైల్‌ రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరనున్నది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు 5.15 శాతంగా ఉన్న విషయం తెలిసిందే.logo