బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Mar 20, 2020 , 16:43:12

కరోనా ప్రభావం.. ఐకియా స్టోర్స్‌ బంద్‌

కరోనా ప్రభావం.. ఐకియా స్టోర్స్‌ బంద్‌

హైదరాబాద్‌ : కోవిడ్‌-19 రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తమ వినియోగదారులు, సహ కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా ఐకియా స్టోర్స్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఐకియా ఇండియా సీఈవో, సీఎస్‌వో పీటర్‌ బెట్జిల్‌ తెలిపారు. వినియోగారులు, సహకార్మికుల స్పందన అదేవిధంగా భారత ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీటర్‌ వెల్లడించారు. స్థానిక పరిస్థితులను అనుసరించి తదుపరి తమ నిర్ణయం ప్రకటించినట్లు చెప్పారు. 

ఈ నేపథ్యంలో ఐకియా హైదరాబాద్‌ స్టోర్‌ను సైతం ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి మూసివేస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికి వినియోగదారులు ఆన్‌లైన్‌ ద్వారా షాపింగ్‌ చేసే సదుపాయం ఉన్నట్లు వెల్లడించారు. వస్తువుల పంపిణీలో హై శానిటైజేషన్‌ స్టాండర్డ్స్‌ను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. సంస్థ ఉద్యోగలందరూ ప్రస్తుతం సామాజిక దూరం పాటిస్తూ వర్క్‌ ఫ్రం హోం పాటిస్తున్నట్లు వెల్లడించారు.


logo
>>>>>>