బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jul 26, 2020 , 20:26:50

చైనా కంపెనీకి గుర్గావ్ కోర్టు నోటీసులు

చైనా కంపెనీకి గుర్గావ్ కోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్ర‌ముఖ వ్యాపార సంస్థ‌ అలీబాబా గ్రూప్‌కు, దాని ఫౌండర్ జాక్‌మాకు గుర్గావ్‌ కోర్టు సమన్లు జారీచేసింది. ఆ కంపెనీ మాజీ ఉద్యోగి చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు నోటీసులు జారీచేసింది. అలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ వెబ్‌లో గతంలో పనిచేసిన పుష్పేంద్రసింగ్‌ పర్మార్‌ అనే వ్యక్తి పిటిషన్‌ వేశారు. యూసీ బ్రౌజర్‌, యూసీ న్యూస్‌లో తప్పుడు వార్తలు వస్తున్నాయని త‌న‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు వేల నోట్లు రద్దు, భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం అంటూ తప్పుడు ప్రచారం చేసింది కూడా యూసీ న్యూసేన‌ని అని ఆయన వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

అంతేకాకుండా భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై కూడా త‌ప్పుడు వార్త‌లు వ‌స్తే సెన్సార్‌ చేశారని ఆరోపించారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌ చేప‌ట్టిన జిల్లా సివిల్‌ జడ్జి అలీబాబా కంపెనీకి నోటీసులు జారీచేశారు. నెల రోజుల్లో నోటీసుల‌కు రాతపూర్వ‌క‌ సమాధానం ఇవ్వాలని, ఈ నెల 29న నేరుగా లేదా లాయర్‌ ద్వారా కోర్టులో హాజరుకావాలని సూచించారు. 

కాగా, భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను బ్యాన్‌ చేసింది. యూసీ బ్రౌజర్‌, యూసీ న్యూస్‌ కూడా వాటిలో ఉన్నాయి. దీంతో ఇప్పుడు వాటిపై కోర్టులో పిటిషన్‌ దాఖలు కావడం చర్చనీయాంశమైంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo