ఎయిర్ ఇండియాపై అజయ్ సింగ్ కన్ను!

పూర్తిస్థాయి వాటా కొనుగోలుకు స్పైస్‌జెట్ ప్రమోటర్ ఆసక్తి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్ ఇండియాపై అజయ్ సింగ్ కన్ను పడినట్లు తెలుస్తున్నది. ఎయిర్ ఇండియాను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న నరేంద్ర మోదీ సర్కార్‌కు ఇది శుభవార్త. చౌకగా విమాన సేవలు అందించాలనే ఉద్దేశంతో 2005లో స్పైస్‌జెట్‌ను ఆరంభించిన అజయ్ సింగ్..ఆ తర్వాతి కాలంలో కళానిధి మారన్ వాటాను కూడా కొనుగోలు చేసి పూర్తిగా చేజిక్కించుకున్నారు. అజయ్ సింగ్‌తోపాటు ఇద్దరు పెట్టుబడిదారులతో కలిసి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. వీరిలో ఒకరు విదేశీ పెట్టుబడిదారు ఉండటం గమనార్హం. మరోవైపు కోల్‌కతాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పవన్ రుయాతోపాటు టాటా గ్రూపు కూడా బిడ్‌ను దాఖలు చేశాయి. టాటా గ్రూపు సింగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్లెన్స్తో కలిసి ఈ బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తున్నది.
కేంద్రానికి మొండి చెయ్యి
ఎయిర్ ఇండియాను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న కేంద్రానికి దీనిని కొనుగోలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో పలుమార్లు బిడ్డింగ్ ప్రక్రియను వాయిదావేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎయిర్ ఇండియాలో వాటాలను విక్రయించాలని చూసిన నరేంద్ర మోదీ సర్కార్‌కు నిరాశ తప్పలేదు. ప్రస్తుతం సంస్థకు రూ.38,366 కోట్ల అప్పు ఉన్నది.
తాజావార్తలు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్‌పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్‌లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- ట్విట్టర్ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్
- కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేయకపోయుంటే..
- 89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
- మర్యాద రామన్న..కృష్ణయ్యగా మారాడు..!