గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Dec 24, 2020 , 23:02:53

జియోకు సవాల్‌: వరుసగా రెండోనెలలో ఎయిర్‌టెల్‌ పైచేయి

జియోకు సవాల్‌: వరుసగా రెండోనెలలో ఎయిర్‌టెల్‌ పైచేయి

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ జియోపై సునీల్‌ మిట్టల్ ఆధ్వర్యంలోని భారతీ ఎయిర్‌ టెల్‌ వరుసగా రెండో నెలలో పై చేయి సాధించింది. గత అక్టోబర్‌లో వరుసగా రెండో నెలలో జియో కంటే ఎక్కువగా సబ్‌స్క్రైబర్లను ఎయిర్‌ టెల్‌ పెంచుకున్నదని భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) ప్రకటించింది. ట్రాయ్‌ వెల్లడించిన వివరాల మేరకు గత అక్టోబర్‌లో భారతీ ఎయిర్‌టెల్‌లో నూతనంగా 36.7 లక్షల మంది సబ్‌ స్క్రైబర్లు జత కలిశారు. 

ఇక ముకేశ్‌ అంబానీ ఆధ్వర్యంలోని జియో 22.2 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను మాత్రమే సంపాదించుకోగలిగింది. అక్టోబర్‌ నాటికి ఎయిర్‌టెల్‌ మొత్తం సబ్‌స్క్రైబర్లు 330.28 మిలియన్లకు చేరుకున్నది. నాలుగేండ్ల తర్వాత అక్టోబర్‌ నెలలో దేశీయ టెలికం రంగంలో సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడంలో తొలిసారి ఎయిర్‌ టెల్‌ ఆధిపత్యం సాధించగలిగింది. అయితే, రిలయన్స్‌ జియో సబ్‌స్క్రైబర్లు మొత్తం 406.35 మిలియన్లుగా ఉన్నారు. ఓవరాల్‌గా రిలయన్స్‌ జియో.. దేశీయ టెలికం రంగానికి నాయకత్వం వహిస్తోంది. ఇక వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ తన సబ్‌స్క్రైబర్‌ పునాదిని కోల్పోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo