గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 05, 2021 , 01:30:47

ఎయిర్‌బస్‌తో జీఎమ్మార్‌ ఒప్పందం

ఎయిర్‌బస్‌తో జీఎమ్మార్‌ ఒప్పందం

బెంగళూరు, ఫిబ్రవరి 4: విమానయాన సేవలు, సాంకేతిక పరిజ్ఞాణం, ఆవిష్కరణల విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి జీఎమ్మార్‌ గ్రూపు..ఎయిర్‌బస్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా 2021లో భాగంగా ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. నిర్వహణ, ఇడి భాగాల, శిక్షణ, డిజిటల్‌, విమానాశ్రయ సేవలతో సహా పలు వ్యూహాత్మక రంగాల్లో గల అవకాశాలపై అన్వేశించడానికి ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయని జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌జీకే కిశోర్‌ తెలిపారు. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వాణిజ్య సైనిక విమానాల కోసం విసృ్తత స్థాయి సేవలు అందించడానికి వీలు పడనున్నదన్నారు. 

VIDEOS

logo