ఆదివారం 07 మార్చి 2021
Business - Dec 19, 2020 , 02:01:57

కారులో ఫ్రంట్‌ ప్యాసింజర్‌కూ ఎయిర్‌బ్యాగ్‌!

కారులో ఫ్రంట్‌ ప్యాసింజర్‌కూ ఎయిర్‌బ్యాగ్‌!

  • త్వరలో కేంద్రం మార్గదర్శకాలు 

న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా అన్ని కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయబోతున్నది. ప్రస్తుతం కొన్ని కార్లలో డ్రైవర్‌ సైడ్‌ మాత్రమే ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటున్నాయి. ఫ్రంట్‌ ప్యాసింజర్‌ సైడ్‌లో కూడా ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి చేసే యోచనలో కేంద్రం ఉన్నది. ఈ ప్రతిపాదనకు దేశం లో అతిపెద్ద టెక్నికల్‌ కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి త్వరలో కేంద్రం నూతన మార్గదర్శకాలను విడుదల చేయబోతున్నది.  రెండేండ్ల క్రితం డ్రైవర్‌ సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరిగా ఉండాలని మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. 

VIDEOS

logo