బుధవారం 27 మే 2020
Business - Apr 18, 2020 , 22:29:56

మే 4 త‌ర్వాత ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్స్‌

 మే 4 త‌ర్వాత ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్స్‌

ఎయిర్ ఇండియా విమాన‌యాన సంస్థ‌ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  దేశీయ ప్రయాణాలతో పాటు విదేశీ ప్రయాణాలకు మే 4నుంచి టిక్కెట్ బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. క‌రోనా నేప‌థ్యంలో  ప్ర‌స్తుతం సర్వీసులు ఆపేశామ‌ని... మ‌ళ్లీ య‌థాతదంగా మే 3 తర్వాత నుంచి దేశీ సర్వీసులకు టిక్కెట్లు బుకింగ్స్ ఓపెన్ చేశామ‌ని పేర్కొంది. విదేశీ ప్రయాణాలు మే31 తర్వాత నుంచి పునరుద్ధరిస్తామ‌ని తెలిపింది. అయితే  సెలక్ట్ చేసిన రూట్లకు మాత్రమే బుకింగ్స్ అవుతాయని చెప్పింది. ఇక‌ ఇంటర్నేషనల్ విమానాలు  జూన్1 నుంచి బుక్ చేసుకోవచ్చని సంస్థ ప్ర‌తినిధులు వివ‌రించారు.


logo