ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Dec 10, 2020 , 01:25:12

హైదరాబాద్‌-షికాగో ఫ్లైట్‌

హైదరాబాద్‌-షికాగో ఫ్లైట్‌

హైదరాబాద్‌: అమెరికాకు ఎయిర్‌ ఇండియా మరో విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురాబోతున్నది. హైదరాబాద్‌ నుంచి నేరుగా షికాగోకు వెళ్లే సర్వీసును వచ్చే నెల 15న ఆరంభించబోతున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందుకోసం 238 ప్రయాణికులు కూర్చోవడానికి వీలుండే బోయింగ్‌ 777-200 విమానాన్ని వినియోగించబోతున్నది. దీనిలో 8 ఫస్ట్‌ క్లాస్‌ సీట్లు, 35 బిజినెస్‌ క్లాస్‌, 195 ఎకానమీ క్లాస్‌ సీట్లుంటాయి. హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నూతన సర్వీసును ప్రారంభిస్తున్నట్టు ఎయిర్‌ ఇండియా తెలిపింది. 

VIDEOS

logo