శనివారం 06 జూన్ 2020
Business - May 06, 2020 , 07:20:25

ఆర్థికరంగానికి వ్యవ‘సాయం’

ఆర్థికరంగానికి వ్యవ‘సాయం’

న్యూఢిల్లీ: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశ వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. దీంతో రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో దేశ వ్యవసాయ రంగంపై మహమ్మారి ప్రభావం చూపకపోవడం ఊరట కలిగిస్తున్న అంశమని పేర్కొంటున్నారు. ఈ వానాకాలం, యాసంగి సీజన్‌లో దాదాపు 30 కోట్ల టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తి కానున్నట్టు అంచనా వేస్తున్నారు. దేశ శ్రామిక శక్తిలో దాదాపు 55 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి పని చేస్తున్నారని, కాబట్టి మార్కెట్‌లో రైతులు అమ్మదలుచుకున్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది వ్యవసాయ రంగం 3 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తుందని, 2020-21 ఆర్థిక ఏడాదికి దేశ జీడీపీ వృద్ధిలో ఇది 0.5 శాతానికి సమానమని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌ తెలిపారు.


logo