Affordable loan @BOB | చౌక వడ్డీకే ఇండ్ల రుణాలు మంజూరు చేస్తున్న బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) చేరింది. ఇప్పటివరకు ఇస్తున్న రుణాలపై 6.75 శాతం బదులు 0.25 శాతం వడ్డీ తగ్గిస్తున్నట్లు తెలిపింది. అంటే 6.50 శాతం వడ్డీకే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండ్ల రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇతర బ్యాంకుల నుంచి ఇండ్లరుణాల బదిలీకి ఈ వడ్డీరేట్లు అమలవుతాయని పేర్కొంది. నూతన వడ్డీరేట్లు తక్షణం అంటే ఈ నెల ఏడో తేదీ నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ వెసులుబాటు వచ్చే డిసెంబర్ 31 వరకు.. అంటే ఈ ఏడాది వరకు తమ కస్టమర్లకు లభిస్తుందని వెల్లడించింది. ఇతర బ్యాంకుల కంటే తక్కువ వడ్డీరేటుపై బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండ్ల రుణాలు అందిస్తోంది.
ఇంతకుముందు తీసుకున్న ఇండ్ల రుణాల బదిలీ లోన్పైనా ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు బీవోబీ తెలిపింది. రుణాల బదిలీతోపాటు కొత్తగా ఇండ్ల రుణాలు తీసుకునేవారికి ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు వివరించింది.
పలు బ్యాంకులు ఏడు శాతం లోపు వడ్డీకే ఇండ్ల రుణాలు మంజూరు చేస్తున్నాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి 6.65, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 6.65 శాతం వడ్డీకి ఇండ్ల రుణాలు లభిస్తాయి. రూ. 10 లక్షల ఇండ్ల రుణాలపై 20 ఏండ్ల కాలానికి ఈ వడ్డీరేట్ల తేడా ఏంటో చూద్దాం..
బ్యాంకు పేరు——– వడ్డీరేటు (%) ఈఎంఐ (రూ.ల్లో) మొత్తం వడ్డీ (రూ.ల్లో)
బ్యాంక్ ఆఫ్ బరోడా— 6.50 — — — 7,456 — — 7.89 లక్షలు
కొటక్ మహీంద్రా — 6.65 — — — 7,544 — — 8.11 లక్షలు
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 6.66 — — 7,550 — — 8.12 లక్షలు
ఐసీఐసీఐ — — 6.70 — — — — 7,574 — — 8.18 లక్షలు
ఎస్బీఐ — — — 6.70 — —— 7,574 —– — — 8.18 లక్షలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.80 — — 7,633 — — 8.32 లక్షలు