న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా.. వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించే దిశగా టీకాలు వేసుకున్న వారికి కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాయి.
ఈ ఆఫర్ కింద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి ఎక్కువ వడ్డీరేటు చెల్లిస్తారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత యూకో బ్యాంక్ తాజాగా వ్యాక్సిన్ వేసుకున్న వారికి స్పెషల్ ఆఫర్ అందిస్తున్నది.
999 రోజుల గడువుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి అదనంగా 0.30 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నది. మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇది సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది.
ఇప్పటికైతే సాధారణంగా యూకో బ్యాంకులో ఏడు రోజుల నుంచి 10 ఏండ్ల గడువు వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఎఫ్డీ గడువును బట్టి 2.75 నుంచి ఐదు శాతం వడ్డీ రేటు అందిస్తుంది.
ఏడు రోజుల నుంచి 29 రోజుల వరకు 2.75%, 30-45 రోజులకు 3%, 46-90 రోజులకు 3.75%, 91-180 రోజులకు 3.90%, 181-364 రోజులకు 4.7 శాతం వడ్డీ అమలవుతుంది. ఒక ఏడాది గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.90%, 366 రోజుల నుంచి 10 ఏండ్ల వరకు ఐదు శాతం వడ్డీ ఇస్తుంది.
యూకో బ్యాంకుకు ముందు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్ పేరుతో ఎఫ్డీని ప్రారంభించింది. ఈ పథకం కింద 1111 రోజులకు ఎఫ్డీ చేస్తే సాధారణ రేటు కంటే అదనంగా 0.25 % వడ్డీ అందిస్తుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికే ఈ ఆఫర్. ఇక సీనియర్ సిటిజన్లకు 0.50% అదనపు వడ్డీ ఇస్తుంది.
ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడు రోజుల నుంచి 10 ఏండ్లలోపు గడువు వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయొచ్చు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లకు 2.75 నుంచి 5.1 శాతం వడ్డీ లభిస్తుంది.
7-14 రోజులకు 2.75 శాతం, 15-45 రోజులకు 2.90 శాతం, 46-90 రోజులకు 3.25శాతం వడ్డీ లభిస్తుంది. 91-179 రోజులకు 3.90%, 180-364 రోజులకు 4.25 శాతం, 366 రోజులు- రెండేండ్ల లోపు గడువు గల ఎఫ్డీపై 4.90 శాతం, రెండేండ్ల నుంచి మూడేండ్ల లోపు వరకు ఐదు శాతం, 3-10 ఏండ్ల మధ్య గడువు గల ఎఫ్డీలపై 5.10 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
షాకింగ్ :సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా ఊపందుకోని నియామకాలు!
E-Commerce బలోపేతమే లక్ష్యం: క్యూర్‌ఫిట్‌లో టాటా పెట్టుబడులు
ఇండియాలో లాంచ్ అయిన మరో ఖరీదైన కారు
భారత్‌లోనూ క్రిప్టో ఒక అసెట్: నందన్ నిలేకని సంచలనం!!
టాప్ గెయినర్స్ జాబితాలో… బ్రిటానియా,హెచ్ సీఎల్ టెక్..
వ్యాక్సిన్ తీసుకున్న వరుడు కావాలి.. ఇదీ శశీ థరూర్ పంచ్
నేనేమీ నవాజ్ షరీఫ్‌ను కలిసేందుకు వెళ్లలేదు..
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టు షాక్
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
వృథా చేస్తే ఇచ్చే వ్యాక్సిన్లలో కోత.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో అగ్ని ప్రమాదం
వాట్సాప్ స్టేటస్.. రిపోర్టర్‌పై కేసు