బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jul 26, 2020 , 21:25:05

HDFCలో వాటాలు విక్రయించిన ఆదిత్య‌పురి

HDFCలో వాటాలు విక్రయించిన ఆదిత్య‌పురి

న్యూఢిల్లీ: HDFC బ్యాంకు మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆదిత్యపురి ఇటీవల భారీఎత్తున బ్యాంకులో వాటాలను విక్రయించారు. ఆదిత్య‌పురి విక్రయించిన వాటాల సంఖ్య‌‌ 7.42 మిలియన్లుగా ఎక్స్ఛేంజీలు వెల్లడించాయి. దీంతో బ్యాంక్‌లో ఆయన షేర్ వాల్యూ 0.14 శాతం నుంచి 0.01 శాతానికి తగ్గింది. జూలై 21-23 తేదీల‌ మధ్య పురి ఈ షేర్లు విక్రయించారు. ఆదిత్య‌పురి విక్ర‌యించిన షేర్ల వాల్యూ రూ.843 కోట్లుగా అధికారులు తెలిపారు. 

కాగా, 1994లో HDFC బ్యాంకును ప్రారంభించినప్ప‌టి నుంచి ఆద్యిత్యపురి ఆ బ్యాంకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆయన కృషితోనే HDFC బ్యాంకు‌ ఓ బలమైన శక్తిగా ఆవిర్భవించింది. అయితే, ఈ అక్టోబర్‌లో ఆదిత్య‌పురి ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. అందువ‌ల్ల ఇప్పటికే ఆయన వారసుడి కోసం వేట జరుగుతున్న‌ది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo