శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 19, 2021 , 23:17:12

కార్పొరేట్ ‘బ్యాంకు’ల కాన్సెప్ట్ గుడ్:ఆదిత్యపూరీ

కార్పొరేట్ ‘బ్యాంకు’ల కాన్సెప్ట్ గుడ్:ఆదిత్యపూరీ

ముంబై: బ‌్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్ సంస్థ‌ల‌ను అనుమ‌తించ‌వ‌చ్చున‌ని, దీనివ‌ల్ల ఎటువంటి ముప్పు ఉండ‌ద‌ని ప్ర‌ముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ సీఈవో ఆదిత్య పూరీ పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వ్య‌వ‌స్థాప‌కుడైన ఆదిత్య పూరీ.. ఇటీవ‌లే ఆ బ్యాంకు సీఈవోగా వైదొలిగారు. దేశీయ ఎక‌న‌మిక్ గ్రోత్ ఆకాంక్ష‌ల‌ను అందుకోవ‌డానికి మ‌రిన్ని బ్యాంకులు ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ చెప్పారు. 

దేశీయ బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్ సంస్థ‌ల‌ను తిరిగి అనుమ‌తించాల‌ని ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఇంట‌ర్న‌ల్ వ‌ర్కింగ్ గ్రూప్ గ‌తేడాది చివ‌రిలో ఇచ్చిన నివేదిక భారీ వివాదంగా మారింది. వివిధ వ‌ర్గాల నుంచి ఆందోళ‌న‌లు వ్య‌క్తం అయ్యా‌యి. వ్య‌క్తుల‌కు బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని, ప్ర‌భుత్వ రంగంలోనూ ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అన్నారు ఆదిత్య పూరీ. అయితే, కార్పొరేట్ సంస్థ‌ల‌కు లైసెన్సులు ఇవ్వ‌డం వ‌ల్ల ఎటువంటి న‌ష్టం జ‌రుగ‌దని ఆయ‌న పేర్కొ‌న్నారు. ఇద్ద‌రు వ్య‌క్తులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ బ్యాంక్‌ యెస్ బ్యాంక్,  మౌలిక వ‌స‌తుల సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇబ్బందుల్లో చిక్కుకున్నాయ‌ని గుర్తు చేశారు. 

ప్ర‌భుత్వ నియంత్ర‌ణ వ‌ల్ల కూడా స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని  ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం తెలిపింద‌ని, స‌రికొత్త విధానం అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆదిత్య పూరి చెప్పారు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ఐదు ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల సామ‌ర్థ్యం సంత‌రించుకోవాలంటే.. దేశంలో మ‌రిన్ని బ్యాంకులు అవ‌స‌రం ఉంద‌న్నారు. నైతిక విలువ‌లు క‌లిగిన స‌రైన కార్పొరేట్ సంస్థ‌కు బ్యాంకింగ్ లైసెన్సు ఇవ్వొచ్చున‌న్నారు. రుణాల వ‌సూళ్ల‌కు బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయ‌డానికి బ‌దులు అమెరికాలో రుణ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సిటీ బ్యాంక్‌, జేపీ మోర్గాన్ వంటి సంస్థ‌లు అనుస‌రిస్తున్న విధానాల‌ను అనుస‌రిస్తే మంచిద‌ని ఆదిత్య పూరి పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo