గురువారం 28 మే 2020
Business - Apr 04, 2020 , 02:56:57

ఆదిత్యా బిర్లా రూ.500 కోట్ల విరాళం

ఆదిత్యా బిర్లా రూ.500 కోట్ల విరాళం

ప్రధాని సహాయ నిధికి రూ.201 కోట్లు ప్రకటించిన వేదాంత

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు  కార్పొరేట్‌ సంస్థలు దన్నుగా నిలుస్తున్నాయి. ఇదివరకే టాటా, మహీంద్రా, విప్రోలు వేలాది కోట్ల రూపాయలను  పీఎం-కేర్స్‌ ఫండ్‌కు తమ విరాళాలను అందించగా..తాజాగా ఆది త్యా బిర్లా గ్రూపు రూ.500 కోట్లను ప్రకటించింది. దీంట్లో రూ.400 కోట్లను ప్రధాని సహాయ నిధికి అందించనున్న సంస్థ..మిగతా రూ.50 కోట్లను ఫిక్కీ-ఆదిత్యా బిర్లా సీఎస్‌ఆర్‌ సెంటర్‌కు, మరో రూ.50 కోట్లను వెంటిలేటర్లు, మాస్క్‌లు, ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్లను కొనుగోలు చేయడానికి వినియోగించనున్నట్లు తెలిపింది. దీంతోపాటు వేదాంత రిసోర్స్‌ కూడా రూ.201 కోట్లు ప్రకటించింది. ప్రభుత్వరంగ ఎరువుల తయారీ సంస్థలు మొత్తంగా రూ.32 కోట్లను అందచేశాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ప్రధాని సహాయ నిధికి తన లక్ష రూపాయల వేతనాన్ని విరాళంగా అందించారు.


logo