మంగళవారం 09 మార్చి 2021
Business - Feb 01, 2021 , 17:46:32

ఇంటి రుణం వ‌డ్డీపై మ‌రో ఏడాది ప‌న్ను రాయితీ!

ఇంటి రుణం వ‌డ్డీపై మ‌రో ఏడాది ప‌న్ను రాయితీ!

న్యూఢిల్లీ: సొంతింటి క‌ల నిజం చేసుకోవాల‌నుకునే వారికి శుభ‌వార్తే. దేశ పౌరులంద‌రికి చౌక‌ధ‌ర‌లో సొంతిల్లు క‌ల సాకారం చేయ‌డానికి 2019లో మోదీ స‌ర్కార్‌.. ఇంటి రుణం వ‌డ్డీపై రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇచ్చిన ప‌న్ను మిన‌హాయింపును వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు పొడిస్తున్న‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మిన‌హాయింపు ఈ ఏడాది మార్చి నెలాఖ‌రు వ‌ర‌కే ఉంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి 2022 మార్చి నెలాఖ‌రు మ‌ధ్య కాలంలో రుణం తీసుకున్న వారికి మాత్ర‌మే ఈ మిన‌హాయింపు ల‌భిస్తుంది.

2019లో సొంతింటి రుణంపై రూ.1.5 ల‌క్ష‌ల వ‌డ్డీపై ప‌న్ను మిన‌హాయింపు కోసం ఆదాయం ప‌న్ను చ‌ట్టం-1961లో 80ఈఈఏ సెక్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ష‌ర‌తులు, ఇత‌ర రాయితీల‌తో క‌లిపి మొత్తం ఒక ఇంటి కొనుగోలుదారుడికి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ఉంది. భార్యాభ‌ర్త‌లు జాయింట్ హోం లోన్ తీసుకుంటే మిన‌హాయింపు రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు పొందొచ్చు. వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపు దారుడు అన్ని ర‌కాల డిడ‌క్ష‌న్ల‌తో క‌లిపి రూ.3.5 ల‌క్ష‌ల వ‌డ్డీపై ప‌న్ను రాయితీకి ఆదాయం ప‌న్నుశాఖ మిన‌హాయింపులిస్తోంది.

అయితే, సంబంధిత ఇంటి విలువ స్టాంప్ డ్యూటీ ప్ర‌కారం రూ.45 ల‌క్ష‌లు మించ‌రాదు. వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారుడికి ఐటీ చ‌ట్టంలోని 80ఈఈ సెక్ష‌న్ కింద ఇంటి రుణం వ‌డ్డీపై ప‌న్ను రాయితీ వ‌ర్తించ‌దు. మ‌హిళ‌లు కొనుగోలు చేసే ఇండ్ల‌కు మ‌రికొంత వెసులుబాటు ల‌భిస్తుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo