మంగళవారం 26 మే 2020
Business - Apr 28, 2020 , 16:51:14

భార‌త్‌కు ఏడీబీ 1.5 బిలియ‌న్ డాల‌ర్ల రుణం!

భార‌త్‌కు ఏడీబీ 1.5 బిలియ‌న్ డాల‌ర్ల రుణం!

న్యూఢిల్లీ: క‌రోనా ర‌క్క‌సి కార‌ణంగా గ‌త 40 రోజుల నుంచి దేశంలో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. వ్యాపార కార్య‌క‌లాపాలు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయాయి. దీంతో దేశంలో ఆర్థిక వ‌న‌రుల‌కు కొర‌త ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో 1.5 బిలియ‌న్ డాల‌ర్ల రుణం కావాలంటూ ఏషియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ)కు భార‌త్ దర‌ఖాస్తు చేసుకుంది. ఈ ద‌ర‌ఖాస్తు ప‌రిశీలించిన ఏడీబీ రుణం మంజూరుకు ఆమోదం తెలిపింది. కాగా, భార‌త్ ఈ నిధుల‌ను క‌రోనా బాధితుల‌కు వైద్య సేవ‌లు అందిచ‌డానికి, క‌రోనా కార‌ణంగా ఉపాధి కోల్పోయిన పేద‌ల‌కు ఆర్థిక సాయం చేయ‌డానికి, వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ‌ల‌సకూలీల‌కు వ‌స‌తి, భోజ‌న సౌక‌ర్యాలు క‌ల్పించ‌డానికి వినియోగించ‌నుంది.     

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo