శనివారం 30 మే 2020
Business - Apr 28, 2020 , 23:54:27

భారత్‌కు ఏడీబీ అండ

భారత్‌కు ఏడీబీ అండ

  • రూ.11,400 కోట్ల రుణం 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ అంతానికి పోరాడుతున్న భారత్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) అండగా నిలిచింది. దాదాపు రూ.11,400 కోట్ల (1.5 బిలియన్‌ డాలర్లు) రుణాన్ని మంజూరు చేసినట్లు మంగళవారం తెలిపింది. వ్యాధి అదుపు, నిర్మూలన వంటి తక్షణ ప్రాధాన్యతలకు మద్దతుగా, పేద, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆసరాగా ఈ రుణ సాయాన్ని అందిస్తున్నది. మునుపెన్నడూ ఎదురవని ఈ సవాల్‌ను జయించడానికి భారత్‌కు మా వంతు సాయం మేము చేస్తామని ఏడీబీ అధ్యక్షుడు మసట్సుగు అసకావా ఈ సందర్భంగా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ఏడీబీ తమ సభ్య దేశాలకు ఆర్థికంగా చేయూతనిస్తున్నది. ఇందులో భాగంగానే భారత్‌కు తాజా రుణాన్ని ఇస్తున్నట్లు వెల్లడించింది. 


logo