శుక్రవారం 29 మే 2020
Business - Mar 29, 2020 , 18:56:13

అదానీ గ్రూప్‌ రూ.100కోట్ల విరాళం

అదానీ గ్రూప్‌ రూ.100కోట్ల విరాళం

ముంబై:  కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ సహాయ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  పీఎం కేర్స్‌ ఫండ్‌కు పలు వాణిజ్య సంస్థలు, పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు.  తాజాగా అదానీ ఫౌండేషన్‌  పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.100కోట్ల భారీ విరాళాన్ని కేటాయించినట్లు తెలిపింది. విపత్కర పరిస్థితుల్లో  కరోనాపై పోరాటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు  భారతీయ పౌరులకు మరింత  సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు    అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతం అదానీ తెలిపారు.

ప్రముఖ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ కూడా పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.100కోట్లు  అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.  కరోనాపై పోరాటానికి ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ పేర్కొన్నారు. 


logo