సోమవారం 18 జనవరి 2021
Business - Nov 27, 2020 , 02:29:24

యాక్టివా 6జీ

యాక్టివా 6జీ

  • ధర రూ.66,816

న్యూఢిల్లీ: దేశీయ వాహన మార్కెట్లోకి 6జీ యాక్టివా స్కూటర్‌ను విడుదల చేసినట్లు హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా తాజాగా ప్రకటించింది. భారత మార్కెట్లోకి యాక్టివా బ్రాండ్‌ అందుబాటులోకి వచ్చి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఎడిషన్‌గా ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్‌ ధరలను రూ.66,816, రూ.68,316గా నిర్ణయించింది. రెండు దశాబ్దాలుగా వినియోగదారులు యాక్టివాపై నమ్మకం ఉంచడం వల్లనే ఇది సాధ్యమైందని, ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా విక్రయాలు జరిపినట్లు కంపెనీ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో వెల్లడించింది.