సోమవారం 01 మార్చి 2021
Business - Feb 10, 2021 , 03:18:52

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఏసీఐ అవార్డు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఏసీఐ అవార్డు

 శంషాబాద్‌, ఫిబ్రవరి 9: జీఎమ్మార్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌(జీహెచ్‌ఐఏఎల్‌)కు ఏసీఐ వరల్డ్‌ (ఎయిర్‌పోర్టు కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌) వారి వాయిస్‌ ఆఫ్‌ కస్టమర్‌ గుర్తింపు లభించింది. కరోనా సమయంలో ప్రయాణీకుల అభిప్రాయాలను తెలసుకొని వారి అవసరాలకు అనుగుణంగా తగు చర్యలను తీసుకుంటూ చేసిన నిరంతర కృషికి ఈ గుర్తింపు లభించినటుల కంపెనీ వర్గాలు వెల్లడించాయి.  విమానయాన ప్రయాణీకుల సురక్షిత ప్రయాణానికి అనేక మెరుగైన చర్యలు తీసుకోవడంతో ప్రయాణీకులలో విశ్వసనీయత పెరిగిందని తెలియజేశారు.   విమానాశ్రయంలో కాంటాక్ట్‌లెస్‌ ఎలివేటర్లు, ఇన్ఫర్మేషన్‌ డెస్క్‌లు, డిజిటల్‌ లావాదేవీలు, సాపింగ్‌ కోసం యాప్‌బేస్డ్‌ టెక్నాలజీలు, ప్యాసింజర్‌ బ్యాగ్‌ యువి శానిటైజేషన్‌, క్యాపుల పరిశుభ్రత, క్రిమిసంహారక చర్యలు, సామాజిక దూరం అమలు, 100 మంది నిపుణుల పర్యవేక్షణలో చర్యలు తీసుకోవడం వల్లనే ఈ గుర్తింపు లభించిందని  ఎయిర్‌పోర్టు సీఈఓ ప్రదీప్‌ ఫణికర్‌ చెప్పారు.   

VIDEOS

logo