బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Feb 04, 2020 , 23:39:01

యాక్సెంచర్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ కూడా..

యాక్సెంచర్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ కూడా..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ యాక్సెంచర్‌ తన ఇన్నోవేషన్‌ హబ్‌ను మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. డిజిటల్‌ ఎకానమికి సంబంధించిన అనేక నూతన ఆవిష్కరణలకు ఈ ఇన్నోవేషన్‌ హబ్‌ వేదిక కానుంది. మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన  ఈ హబ్‌లో 2 వేల మంది ఉద్యోగులు కూర్చోవడానికి వీలుంటుందని, ముఖ్యంగా వీరు కృత్రిమ మేధస్సు, ఆటోమైజేషన్‌ సహా పలు రకాల టెక్నాలజీలకు సం బంధించిన ఆవిష్కరణలు చేయనున్నారు. ఈ సందర్భంగా కంపెనీ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ భాస్కర్‌ గోష్‌ మాట్లాడుతూ..ఆవిష్కరణల లక్ష్యాలకు చేరుకోలేక పోతున్న సంస్థలకు అన్ని రకాలు చేయూతనిచ్చే ఉద్దేశంలో భాగంగా ఈ ఇన్నోవేషన్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.  మా క్లయింట్స్‌ అవసరాలకు తగిన విధంగా ఆవిష్కరణలు ఈ సెంటర్‌లోనే జరుగనున్నాయి.  ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌లో ఎసెంచర్‌ కంపెనీకి చెందిన తొలి నానోల్యాబ్‌ ఇదే కావడం గమనార్హం.  


logo
>>>>>>