ఆదివారం 31 మే 2020
Business - Apr 12, 2020 , 00:40:46

0.2% మందిలోనే ఆ సత్తా!

0.2% మందిలోనే ఆ సత్తా!

  • ఐటీ ఉద్యోగుల వర్క్‌ ఫ్రం హోం సామర్థ్యంపై సర్వే

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం అన్నిచోట్లా లాక్‌డౌన్లు విధించడంతో ఐటీ కంపెనీల ఉద్యోగులంతా వర్క్‌ ఫ్రం హోం నిర్వర్తిస్తున్నారు. కానీ వీరిలో చాలామంది పనితీరు సక్రమంగా లేదని, కేవలం 0.2 శాతం మంది మాత్రమే చక్కగా పనిచేస్తున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మిగిలిన 99.8 శాతం మందికి ఇండ్ల నుంచి విధులు నిర్వర్తించే సామర్థ్యం లేదని ‘సైకీ మైండ్‌టెక్‌' అనే సంస్థ తన సర్వే నివేదికలో స్పష్టం చేసింది. ఇండ్ల నుంచి విధులు నిర్వర్తించలేకపోతున్నవారిలో చాలామంది కొత్తగా నేర్చుకోవడం, విశ్లేషణ (95% మంది), ప్రాక్టికల్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యాల కొరత (65%  మంది), సరైన ప్రణాళిక లేకపోవడం (71%మంది).. ఇలా ఏదో ఒక అంశంలో వెనుకబడి ఉన్న ట్టు ఈ సర్వేలో తేలింది. సవాళ్లను స్వీకరించేందుకు 16.97% మంది సిద్ధంగా ఉన్నారని, ఇలాంటివారికి చిన్నచిన్న సలహాలిస్తే సత్ఫలితాలుంటా యన్నది. 


logo