ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 20, 2020 , 01:15:33

5 నిమిషాల్లో రూ.5 లక్షల రుణం

5 నిమిషాల్లో రూ.5 లక్షల రుణం

  • బ్యాంకుకు వెళ్లకుండానే సాధ్యం

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? అయితే మీరు సులభంగా రుణం పొందే అవకాశం ఒకటి అందుబాటులో ఉన్నది. ఇందుకోసం మీరు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క యాప్‌ సాయంతో ఇంటి నుంచే రుణాన్ని పొందవచ్చు. నవీ అనే సంస్థ ఇటీవల ‘నవీ లెండింగ్‌' పేరుతో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో కస్టమర్లు రూ.5 లక్షల వరకు ఇన్‌స్టంట్‌ పర్సనల్‌ లోన్‌ను తీసుకోవచ్చు. ఈ రుణాన్ని 36 నెలల్లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్‌ ప్లేస్టోర్‌లో ‘నవీ లెండింగ్‌' యాప్‌ అందుబాటులో ఉన్నది. రుణం పొందాలనుకొనేవారు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని తమ రుణ అర్హతలను తెలుసుకోవాలి. ఇందుకోసం పాన్‌, ఆధార్‌ నంబర్లు అవసరమవుతాయి. ఎలాంటి డాక్యుమెంట్లను గానీ, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌, పేస్లిప్‌ లాంటి వాటినిగానీ అప్‌లోడ్‌ చేయాల్సిన పనిలేదు. లోన్‌ ప్రాసెసింగ్‌ అంతా పేపర్‌లెస్‌, కాంటాక్ట్‌లెస్‌ పద్ధతుల్లో సులభంగా జరిగిపోతుంది. అర్హత ఉంటే మీకు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే రుణం లభిస్తుంది. నేరుగా మీ బ్యాంక్‌ అకౌంట్‌కే డబ్బులు వచ్చేస్తాయి. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌లెర్నింగ్‌ లాంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని, అర్హతలున్న కస్టమర్లకు కేవలం 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే రుణాలు అందజేస్తున్నామని ‘నవీ’ సంస్థ వెల్లడించింది.


logo