బుధవారం 21 అక్టోబర్ 2020
Business - Aug 07, 2020 , 03:18:05

బంగారు నగలపై 90% రుణం

బంగారు నగలపై 90% రుణం

  • అన్ని రకాల రుణాల పునర్వ్యవస్థీకరణకు సై
  • పరపతి సమీక్షలో ఆర్బీఐ

కొవిడ్‌-19 అన్ని వర్గాలనూ కుదిపేస్తున్న నేపథ్యంలో గృహస్తులనూ దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ద్రవ్యసమీక్షను చేపట్టింది. బంగారు నగల విలువలో 90 శాతం వరకు బ్యాంకులు రుణాలను ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆభరణాల విలువలో 75 శాతం వరకే రుణాలిస్తున్నారు. ఇప్పుడు మరో 15 శాతం వరకు అదనంగా నగల తాకట్టుపై రుణాలు రానుండగా, వచ్చే ఏడాది మార్చి 31దాకా ఈ సడలింపు అమల్లో ఉంటుంది.


logo