శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 14, 2020 , 00:13:46

దేశానికి రూ.8 లక్షల కోట్ల నష్టం

దేశానికి రూ.8 లక్షల కోట్ల నష్టం

న్యూఢిల్లీ: ఈ 21 రోజుల లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.7-8 లక్షల కోట్ల నష్టం వాటిల్లి ఉండవచ్చని నిపుణులు, వ్యాపార, పారిశ్రామిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. స్తంభించిన కర్మాగారాలు, వ్యాపారాలు, రవాణా వ్యవస్థల వల్ల గడిచిన మూడు వారాల్లో 70 శాతం ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయని సెంట్రమ్‌ ఇనిస్టిట్యూషనల్‌ రిసెర్చ్‌, ఆక్యూట్‌ రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ లిమిటెడ్‌ తెలిపాయి. రోజుకు రూ.35 వేల కోట్ల నష్టం వస్తున్నదని ఆక్యూట్‌ రేటింగ్స్‌ చెప్తున్నది. తొలి 15 రోజుల్లో దాదాపు రూ.35,200 కోట్ల ఆదాయాన్ని కోల్పోయామని అఖిల భారత మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ తెలిపింది. నిర్మాణ రంగం రూ.లక్ష కోట్లు నష్టపోయిందని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ తెలిపింది. రిటైల్‌ రంగానికీ నష్టం జరిగిందన్న నిపుణులు.. 7 కోట్ల చిన్న, మధ్య, భారీ ట్రేడర్లు 45 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నారని గుర్తుచేశారు.


logo