సోమవారం 18 జనవరి 2021
Business - Dec 06, 2020 , 00:47:00

ఆరేండ్లలో 8 లక్షల కోట్లు

ఆరేండ్లలో 8 లక్షల కోట్లు

  • భారత్‌ నుంచి ఎగుమతికానున్న మదర్‌బోర్డ్‌ల విలువ

న్యూఢిల్లీ: దేశీయంగా తయారవుతున్న మదర్‌బోర్డ్‌ (పీసీబీఏ)లకు విదేశాల్లో డిమాండ్‌ పెరుగుతున్నది. 2021 నుంచి 2026 మధ్యకాలంలో భారత్‌ నుంచి రూ.8 లక్షల కోట్ల విలువైన మదర్‌బోర్డ్‌లు ఇతర దేశాలకు ఎగుమతికానున్నాయి. ఈ విషయాన్ని మొబైల్‌ పరికరాల ఇండస్ట్రీ బాడీ ఐసీఈఏ, ఈవై సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో అంచనా వేశాయి. రాయితీలు, సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో  రూ.29,500 కోట్లు తగ్గనున్నదని  ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ పంకజ్‌ మోహింద్రో తెలిపారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారం లేకుంటే ఈ ఎగుమతులు 4 బిలియన్‌ డాలర్లు తగ్గవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పీసీబీఏ ఇండస్ట్రీ విలువ రూ.2 లక్షల కోట్లుగా ఉన్నదని, 2026 నాటికి ఇది రూ.6.4 లక్షల కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని అన్నారు. 2025 నాటికి భారత్‌లో 400 బిలియన్‌ డాలర్ల (రూ.26 లక్షల కోట్ల) ఎలక్ట్రానిక్‌ పరికరాలు తయారు చేయాలని జాతీయ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ 2019లో లక్ష్యంగా నిర్ణయించారు.