Best Selling Cars May | గతనెలలో రికార్డు స్థాయిలో కార్లు అమ్ముడయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 3,34,800 కార్లు అమ్ముడు కావడం ఆల్ టైం రికార్డు. వాటిల్లో మారుతి సుజుకిదే ప్రధాన వాటా. మొత్తం కార్ల సేల్స్‌లో టాప్-10 కార్లలో మారుతి సుజుకికి చెందిన ఏడు మోడల్ కార్లు, టాటా మోటార్స్ రెండు, హ్యుండాయ్ మోటార్ ఇండియా ఒకటి నిలిచాయి.
మారుతి సుజుకిలో బాలెనో, స్విఫ్ట్, వ్యాగన్-ఆర్, బ్రెజా, ఎకో, డిజైర్, ఎర్టిగా నిలిచాయి. టాటా నెక్సన్, పంచ్, హ్యుండాయ్ మోటార్ ఇండియా క్రెటా మోడల్ కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి బాలెనో అత్యధికంగా 18,700 యూనిట్లు విక్రయించగా, స్విఫ్ట్ 17,300, వ్యాగన్-ఆర్ 16,300 నిలిచాయి.
హ్యుండాయ్ క్రెటా 14,449, టాటా నెక్సాన్ 14,423, మారుతి సుజుకి 13,398 యూనిట్లు సేల్ అయ్యాయి. మారుతి సుజుకి ఎకో స్ఫూర్తిదాయకంగా 12,800 యూనిట్లు, వ్యాన్ డిజైర్ 11,300 అమ్ముడయ్యాయి. టాటా పంచ్ 11,100 కార్లు, మారుతి ఎర్టిగా 10,500 యూనిట్లు సేల్ అయ్యాయి.
మారుతి సుజుకి బాలెనో -18,700
మారుతి సుజుకి స్విఫ్ట్ – 17,300
మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ – 16,300
హ్యుండాయ్ క్రెటా – 14,449,
టాటా నెక్సాన్ – 14,423
మారుతి సుజుకి బ్రెజా – 13,398
మారుతి సుజుకి ఎకో – 12,800
మారుతి సుజుకి డిజైర్- 11,300
టాటా పంచ్ -11,100
మారుతి సుజుకి ఎర్టిగా – 10,500.