శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 04, 2020 , 02:14:13

62 వేల కోట్ల ఐటీ రిఫండ్స్‌

62 వేల కోట్ల ఐటీ రిఫండ్స్‌

న్యూఢిల్లీ, జూలై 3: గడిచిన రెండు నెలల్లో 20 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.2,361 కోట్ల రిఫండ్‌ చెల్లింపులు జరిపింది ఆదాయ పన్ను శాఖ. ఏప్రిల్‌ 8 నుంచి జూన్‌ 30 మధ్యకాలంలో ఈ రిఫండ్‌ చెల్లింపులు జరిపినట్లు శుక్రవారం ఐటీ శాఖ ఒక ప్రకటనలలో వెల్లడించింది. వీటిలో 19.07 లక్షల వ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు రూ.23,453.57 కోట్ల రిఫండ్‌ చేసిన ఐటీ శాఖ..కార్పొరేట్‌ ట్యాక్స్‌ కింద 1.36 లక్షల మందికి రూ. 38,908.37 కోట్ల చెల్లింపులు జరిపింది. అంటే గడిచిన రెండు నెలల్లో ఒక్క నిమిషానికి 76 కేసులను పరిష్కరించినట్లు, ఈ 56 రోజుల్లో భారీ స్థాయిలో రిఫండ్‌ చెల్లించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక ప్రకటనలలో వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులకు సంబంధించి బ్యాంక్‌ ఖాతాల్లో ఈ రిఫండ్‌ జమ చేయడం జరుగుతున్న దని, ఈ రిఫండ్‌ గురించి ఎవరు డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. రిఫండ్‌కు సంబంధించి ఆదాయ పన్ను శాఖ పంపిన ఈ-మెయిల్స్‌కు వెంటనే స్పందించాలని పన్ను చెల్లింపుదారులకు సూచించింది. 


logo