సోమవారం 01 జూన్ 2020
Business - Apr 28, 2020 , 09:47:12

6కోట్ల డాల‌ర్ల న‌ష్టాల్లోకి ప్ర‌పంచ‌దేశాలు

6కోట్ల డాల‌ర్ల న‌ష్టాల్లోకి ప్ర‌పంచ‌దేశాలు

6కోట్ల డాల‌ర్ల న‌ష్టాల్లోకి ప్ర‌పంచ‌దేశాలు

క‌రోనా ఎఫెక్ట్‌తో అన్ని దేశాల ఎకానమీలూ పతనం వైపు వెళుతున్నాయ‌ని..  సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా... అత్యంత అద్వాన్న పరిస్థితుల్లోకి జారిపోయాయని కొంత‌మంది ఆర్థిక వేత్త‌లు లెక్కలేశారు. ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల‌ 2020లో ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ (GDP) 4 శాతం పడిపోతుందని అంచ‌నా వేస్తున్నారు. ఐతే... జులై తర్వాత ప్రపంచ దేశాలు తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మొత్తంగా కరోనా వల్ల ఇప్పటివరకూ 6 లక్షల కోట్ల డాలర్ల ( రూ.45,99,90,06,42,14,613) నష్టం వచ్చినట్లు అంచనా వేశారు.

 ముఖ్యంగా  1997లో వచ్చిన ఆసియా మాంద్యం, 2009లో వచ్చిన ప్రపంచ మాద్యం లాగా ఇప్పుడు కరోనా వల్ల ప్రపంచ దేశాల పునాదులు కదిలిపోయే పరిస్థితి ఉండబోతుందని ఆర్థిక వేత్తులు పేర్కొంటున్నారు.ఇక ప్రపంచ దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై  ప్రభావం చూపే అమెరికాలో కూడా ఆర్థిక వ్యవస్థ జీడీపీ 6.4 శాతం త‌గ్గే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొంటున్నారు. యూరో కరెన్సీ ఉన్న దేశాల్లో జీడీపీ 8.1, జపాన్‌లో 4 శాతం, ఇక చైనాలో ఇదివరకూ ఎన్నడూ లేని విధంగా తక్కువగా జీడీపీ నమోదవుతుందని తెలిపారు. ఈ భారీ నష్టాల నుంచి బయటపడాలంటే క్రమంగా లాక్‌డౌన్ నిబంధలను సడలించాలని ఆర్థిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


logo