సోమవారం 08 మార్చి 2021
Business - Jan 03, 2021 , 01:05:04

మరింత పెరిగిన జీఎస్టీ ఈ-ఇన్వాయిస్‌లు

మరింత పెరిగిన జీఎస్టీ ఈ-ఇన్వాయిస్‌లు

  • డిసెంబర్‌లో 6.03 కోట్లకు చేరిక

న్యూఢిల్లీ, జనవరి 2: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కి సంబంధించి డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 6.03 కోట్ల ఎలక్ట్రానిక్‌ ఇన్వాయిస్‌ (ఈ-ఇన్వాయిస్‌)లు జనరేట్‌ అయ్యాయి. నవంబర్‌లో జనరేట్‌ అయిన 5.89 కోట్ల ఈ-ఇన్వాయిస్‌ల కంటే డిసెంబర్‌లో దాదాపు 14 లక్షలు అధికంగా జనరేట్‌ అయినట్లు కేంద్రం ప్రకటించింది. రూ.500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్‌తో బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ) లావాదేవీలు జరుపుతున్న వ్యాపార సంస్థలు ఈ-ఇన్వాయిస్‌లను జనరేట్‌ చేయడాన్ని 2020 అక్టోబర్‌ 1 నుంచి ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం విదితమే. వస్తు, సేవల పన్ను వ్యవస్థలో ‘గేమ్‌ ఛేంజర్‌'గా ఉన్న ఈ-ఇన్వాయిస్‌ విధానం మూడు నెలల ప్రయాణాన్ని జయప్రదంగా పూర్తి చేసుకున్నదని ఆదా య పన్ను శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.

నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ఈ-ఇన్వాయిస్‌ వ్యవస్థను అభివృద్ధి చేసినప్పటి నుంచి గత మూడు నెలల్లో 37 వేల మందికిపైగా పన్ను చెల్లింపుదారులు 16.80 కోట్లకుపైగా ఇన్వాయిస్‌ రిఫరెన్స్‌ నంబర్‌ (ఐఆర్‌ఎన్‌)లను జనరేట్‌ చేశారని తెలిపింది. 2020 అక్టోబర్‌లో 4.95 కోట్లతో ప్రారంభమైన ఈ-ఇన్వాయిస్‌లు.. నవంబర్‌లో 5.89 కోట్లకు, డిసెంబర్‌లో 6.03 కోట్లకు పెరిగాయని ఆదాయ పన్ను శాఖ వివరించింది.

VIDEOS

logo