గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 21, 2020 , 00:29:14

100 మిలియన్‌ డాలర్ల ఐటీ ఉత్పత్తులు

100 మిలియన్‌ డాలర్ల ఐటీ ఉత్పత్తులు

  • ఇండియా సాఫ్ట్‌, గ్లోబల్‌ సాఫ్ట్‌ సదస్సుల్లో 400 ఒప్పందాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణః ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా సాఫ్ట్‌, గ్లోబల్‌ సాఫ్ట్‌ సదస్సుల్లో చేసుకున్న ఒప్పందాలతో 100 మిలియన్‌ డాలర్ల విలువైన ఐటీ ఎగుమతి ఆర్డర్‌లకు అవకాశం లభించినట్టు నిర్వాహక కమిటీ ఛైర్మన్‌ నలిన్‌ కోహ్లీ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఎప్పుడు లేనివిధంగా వ్యాపారాన్ని విస్తరించేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సదస్సుల్లో అమెరికా ఎగ్జిబిటర్లు కూడా తమ అధునాతన ప్రాజెక్టులను, ఉత్పత్తులను ప్రదర్శించారని పేర్కొన్నారు. ఈ సదస్సుల వేదికగా 400 ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. దీనిలో 50 దేశాల నుంచి 350 మందికిపైగా ఐటీ కొనుగోలు దారులు పాల్గొన్నారని వెల్లడించారు. 


logo
>>>>>>