గురువారం 26 నవంబర్ 2020
Business - Sep 23, 2020 , 00:49:45

4 వేలకే స్మార్ట్‌ ఫోన్‌!

4 వేలకే స్మార్ట్‌ ఫోన్‌!

  • మార్కెట్లోకి తేనున్న జియో 

న్యూఢిల్లీ: టెలికం రంగంలో ప్రభంజనం సృష్టించిన రిలయన్స్‌ జియో మరోమారు సత్తచాటడానికి సిద్ధమవుతున్నది. ఇదివరకే పలు స్మార్ట్‌ఫోన్లను విక్రయించిన సంస్థ త్వరలో రూ.4 వేలకే  స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్నది. ఇందుకోసం దేశీయ మొబైల్‌ తయారీ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తున్నది. 

నూతన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లు

 మరోమారు టారిఫ్‌ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయడంలో భాగంగా సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది జియో. రూ.399 నుంచి రూ.1,499 వరకు ఉన్న ఈ నెలవారి పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లలో భాగంగా 500 జీబీ వరకు డాటా, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ+హాట్‌స్టార్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నది.