మంగళవారం 31 మార్చి 2020
Business - Mar 16, 2020 , 00:40:55

9 రోజుల్లో 38 వేల కోట్లు

9 రోజుల్లో 38 వేల కోట్లు
  • వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్ల పతనం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో(ఎఫ్‌పీఐ) ఆందోళన మరింత పెంచింది. దీంతో ప్రస్తుత నెలలో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.38 వేల కోట్ల వరకు నిధులను ఉపసంహరించుకున్నారు. కరోనా వైరస్‌ భయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటున్నట్లు వచ్చిన సంకేతాలు ఎఫ్‌పీఐల్లో ఆందోళనను మరింత పెంచాయి. ఈ నెల 2 నుంచి 13 మధ్యకాలంలో(తొమ్మిది రోజుల్లో) ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.24,776 కోట్లను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..డెబిట్‌ మార్కెట్ల నుంచి రూ.13,199.54 కోట్లను తరలించుకుపోయారు. నికరంగా రూ.37,975.90 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ వద్ద ఉన్న సమాచారంమేరకు తెలిసింది. గతేడాది సెప్టెంబర్‌ నుంచి వరుసగా పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు..ప్రస్తుత నెలలో మాత్రం వెనక్కితగ్గారు. 


logo
>>>>>>