బుధవారం 24 ఫిబ్రవరి 2021
Business - Dec 22, 2020 , 00:40:26

33 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత

33 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ. 33 లక్షల విలువైన విదేశీ కరెన్సీని సీఐఎస్‌ఎఫ్‌(సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) అధికారులు సోమవారం పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి షార్జాకు జీ9459 విమానంలో వెళ్తున్న ఓ ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్‌తనిఖీ చేయగా అతని వద్ద యూఎస్‌ డాలర్లు, ఒమన్‌, సౌదీ, ఖతర్‌ రియాల్స్‌ పట్టుబడ్డాయి. వాటిని విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన కరెన్సీ విలువ రూ. 33,53,274 ఉంటుందని తెలిపారు. నిందితుడిని కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

VIDEOS

logo