మంగళవారం 02 మార్చి 2021
Business - Feb 22, 2021 , 01:38:24

ఒక ఖాతాకు 3 డెబిట్‌ కార్డులు

ఒక ఖాతాకు 3 డెబిట్‌ కార్డులు

మూడు ఖాతాలకు ఒకే డెబిట్‌ కార్డు

సాధారణంగా ఒక్కో బ్యాంక్‌ ఖాతాదారునికి ఒక్క డెబిట్‌ మాత్రమే ఇస్తారు. ఒక అకౌంట్‌కు ఒక డెబిట్‌ కార్డు మాత్రమే వస్తుంది. అంటే ఆ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకోవాలని భావిస్తే.. సదరు అకౌంట్‌కు ఇచ్చిన డెబిట్‌ కార్డు ద్వారానే తీసుకునేందుకు వీలవుతుంది. కానీ ఈ నిబంధన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు వర్తించదు. కస్టమర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ బ్యాంకు రెండు సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో మొదటిది ‘యాడ్‌ ఆన్‌ కార్డు’ ఫీచర్‌. రెండవది ‘యాడ్‌ ఆన్‌ అకౌంట్‌' ఫీచర్‌. యాడ్‌ ఆన్‌ కార్డు ఫీచర్‌ కింద ఒక్కో అకౌంట్‌కు మూడు డెబిట్‌ కార్డులు లభిస్తాయి. ఖాతాదారునితోపాటు అతని జీవిత భాగస్వామికి, తల్లిదండ్రులకు, పిల్లలకు ఈ కార్డులను జారీ చేస్తారు. అంటే ఒకే ఖాతా నుంచి ముగ్గురు వ్యక్తులు డబ్బులు తీసుకునేందుకు వీలవుతుంది. 

యాడ్‌ ఆన్‌ అకౌంట్‌

సాధారణంగా ఒక డెబిట్‌ కార్డు కేవలం ఒక్క ఖాతాకే అనుసంధానమై ఉంటుం ది. కానీ యాడ్‌ ఆన్‌ అకౌంట్‌ ఫీచర్‌ ద్వారా ఒకే డెబిట్‌ కార్డును మూడు అకౌంట్లకు అనుసంధానించుకోవచ్చు. అంటే ఒక్క డెబిట్‌ కార్డుతోనే మూడు అకౌంట్ల నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ మూడు అకౌంట్లు ఒకే వ్యక్తి పేరుతో ఉండాలి. యాడ్‌ ఆన్‌ అకౌంట్‌ ఫీచర్‌ ద్వారా కేవలం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎంల నుంచి మాత్రమే డబ్బులు తీసుకునేందుకు వీలవుతుంది.

VIDEOS

logo