బుధవారం 12 ఆగస్టు 2020
Business - Aug 01, 2020 , 03:31:26

2G గుడ్‌బై చెప్పేద్దాం

2G గుడ్‌బై చెప్పేద్దాం

  • మొబైల్‌ టెలీఫోనీ రజతోత్సవంలో ముకేశ్‌ అంబానీ

న్యూఢిల్లీ, జూలై 31: దేశంలో 2జీ సేవలకు ఇక గుడ్‌బై చెప్దామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అన్నారు. భారత్‌లో మొబైల్‌ టెలీఫోన్‌ నెట్‌వర్క్‌ మొదలై 25 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం ఇక్కడ జరిగిన రజతోత్సవ వేడుకల్లో ముకేశ్‌ పాల్గొన్నారు. భారత్‌ సహా ప్రపంచ దేశాలన్నీ 5జీ నెట్‌వర్క్‌లోకి అడుగుపెడుతున్న ప్రస్తుత తరుణంలో దేశంలో ఇంకా 2జీ నెట్‌వర్క్‌ ఉండటంతో దాదాపు 30 కోట్ల మొబైల్‌ వినియోగదారులు కనీస ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని పొందలేకపోతున్నారని చెప్పారు. కాబట్టి 2జీ సర్వీసులను చరిత్రలో కలిపేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు తగ్గట్లుగా తక్షణమే విధానపరమైన చర్యలను చేపట్టాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. 1995 ఆగస్టులో దేశీయంగా మొబైల్‌ కాల్స్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లో సెల్‌ఫోన్‌ నుంచి ఒక్క కాల్‌ చేసుకోవాలంటే కాల్‌ చేసినవాగుడ్‌బై చెప్పేద్దాం మొబైల్‌ టెలీఫోనీ రజతోత్సవంలో ముకేశ్‌ అంబానీ రికి (ఔట్‌గోయింగ్‌) రూ.16, ఆ కాల్‌ను స్వీకరించినవారికి (ఇన్‌కమింగ్‌) రూ.8 చొప్పున చార్జీలు వర్తించేవి.  

అధిక పన్నులు వద్దు: మిట్టల్‌

టెలికం రంగంపై అధిక పన్నులు, సుంకాలు విధిస్తున్నారని, వీటిని తప్పక తగ్గించాలని భారతీ ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టెల్కోల పన్ను చెల్లింపులను ప్రభుత్వ ఆదాయ వనరుగా చూడవద్దని కోరారు. 


logo